న్యూఢిల్లీ, అక్టోబర్ 24 (ఎక్స్ప్రెస్ టుడే): ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆ దళ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. వారి ధైర్యసాహసాలను, దృఢ సంకల్పాన్ని, నిస్వార్థ సేవను ఆయన ప్రశంసించారు.
‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టులో ప్రధాని మోదీ, ‘హిమవీర్లు’గా పిలిచే ఐటీబీపీ సిబ్బంది అసాధారణ పరాక్రమంతో ప్రత్యేకత చాటుకున్నారని పేర్కొన్నారు. వారి దృఢ సంకల్పం, త్యాగాలు దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు.