న్యూఢిల్లీ, నవంబర్ 5 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఆసియా పారా గేమ్స్–2026లో పాల్గొన్న భారత బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ముచ్చటించారు. వివిధ క్రీడాంశాల అథ్లెట్లు తమ విజయాలకు గుర్తుగా ప్రత్యేక జ్ఞాపికలను ఆయనకు బహూకరించారు.

జపాన్‌లోని ఐచి–నగోయాలో జరిగిన ఈ క్రీడల్లో 97 మంది భారత పారా అథ్లెట్లు 30 స్వర్ణాలతో సహా 114 పతకాలు సాధించి, ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. 2010లో 14 పతకాల నుంచి ఇప్పుడు 114 పతకాల వరకు సాగిన ఈ ప్రయాణం అథ్లెట్ల కఠోర శ్రమ ఫలితమని ప్రధాని ప్రశంసించారు.

2028 లాస్ ఏంజెలెస్ పారాలింపిక్స్‌పై దృష్టి పెట్టాలని, ఆ క్రీడల్లో భారత్ భాగస్వామ్యాన్ని గరిష్ఠ స్థాయికి చేర్చాలని ఆయన అథ్లెట్లకు సూచించారు.