న్యూఢిల్లీ, అక్టోబర్ 16 (ఎక్స్‌ప్రెస్ టుడే): విమాన టికెట్ ధరలను నియంత్రించేందుకు ఉద్దేశించిన నూతన నిబంధనలు ఖరారయ్యాయని, వచ్చే రెండు వారాల్లో వాటిని నోటిఫై చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

భారతీయ వాయుయాన్ అధినియం-2024 కింద రూపొందిన ఈ నిబంధనలకు సంబంధించి, విమానయాన సంస్థల అధిక ఛార్జీలను అరికట్టాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కొన్ని నెలలుగా విచారణ జరుపుతోంది. ఆగస్టులో ఈ నిబంధనల ముసాయిదాను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించిన కేంద్రం, మూడు వారాల్లో ఖరారు చేస్తామని అప్పట్లో చెప్పింది.

ఈ అంశంపై తదుపరి విచారణ నవంబర్ 16న జరగనుంది.