న్యూఢిల్లీ, అక్టోబర్ 30 (ఎక్స్‌ప్రెస్ టుడే): పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సౌదీ అరేబియాలోని జెద్దా, రియాద్, దమ్మామ్‌లకు రాకపోకలు సాగించే సర్వీసులను ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ నవంబర్ 14 వరకు నిలిపివేశాయి.

అక్కడి విమానాశ్రయాలు సహా మౌలిక సదుపాయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇంతకుముందు రియాద్, దమ్మామ్ సర్వీసులను నవంబర్ 7 వరకు, జెద్దా సర్వీసులను అక్టోబర్ 31 వరకు రద్దు చేసిన సంగతి తెలిసిందే.