విజయనగరం, ఆగస్టు 21: రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈనెల 22న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.
మంత్రి నారా లోకేష్ శనివారం మధ్యాహ్నం విజయనగరం చేరుకుని, విజయనగరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3.30 గంటల వరకు నిర్వహించే హెచ్‌ఆర్‌డీ క్లస్టర్ సమావేశంలో పాల్గొంటారు.
అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 6.30 గంటల వరకు విజయనగరం మండలం చెల్లవూరు గ్రామంలో పార్టీ క్యాడర్‌తో సమావేశంలో పాల్గొంటారు.
అంతకుముందు మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం జిల్లా మధురవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చంద్రంపాలెంలో ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
