80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన ఎరుపు రంగు బంధేజ్ తలపాగా అందరినీ ఆకర్షించింది.
ఎర్రకోటపై జెండా ఎగురవేసే ప్రతిసారీ తనదైన శైలిలో ప్రత్యేక తలపాగాతో దర్శనమిచ్చే ప్రధాని మోదీ, ఈసారి ఎరుపు రంగు తెలుపు, పసుపు చుక్కల బంధేజ్ తలపాగాతో మెరిశారు. దీనికి తగినట్టుగా త్రివర్ణ పాకెట్ స్క్వేర్ను కూడా జతచేశారు.
2014 నుంచి ప్రతి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వైవిధ్యమైన తలపాగాలతో దేశవ్యాప్త హస్తకళలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండటం ఆనవాయితీగా మారింది. ఈసారి తలపాగా ఎంపిక వెనుక రాజస్థాన్, గుజరాత్లలో ప్రాచుర్యంలో ఉన్న బంధేజ్ కళాత్మక నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ఉద్దేశమని భావిస్తున్నారు.
