అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, GSDP వృద్ధి, తాగునీటి వసతులు, గృహనిర్మాణం, జలధారతో పాటు జిల్లాల ఉత్తమ విధానాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన పాలన, సంక్షేమం అందించేలా సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశంలో సీఎం దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో వివిధ శాఖల మంత్రులు కూడా పాల్గొని, తమ శాఖలకు సంబంధించిన పురోగతిని సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలును మరింత వేగవంతం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచనలు అందాయి.