శివసేన అసలైన వారసత్వంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న వేళ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారమే శివసేన ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేదని, ఎన్‌సీపీ దివంగత నేత అజిత్‌దాదా పవార్‌దని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు కూడా ఇదే తరహాలో తీర్పు వెలువరిస్తుందని తాము విశ్వసిస్తున్నట్లు ఫడణవీస్ మీడియాతో అన్నారు. 2022లో శిందే నేతృత్వంలో 39 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో అప్పటి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పతనమైన సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం) నేత సుప్రియా సూలే ఘాటుగా స్పందించారు. శివసేన ఠాక్రేదేనని, ఎన్‌సీపీ శరద్ పవార్‌దేనని ఆమె పేర్కొనడంతో ఫడణవీస్ తిప్పికొట్టారు.
