థానే, సెప్టెంబర్ 29: శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పార్టీ థానే నగర విభాగ ప్రముఖ్ ప్రదీప్ పూర్ణేకర్‌పై గుర్తు తెలియని దుండగులు మంగళవారం కాల్పులు జరిపారు.
- థానేలోని మనోరమానగర్ ప్రాంతంలో ఘటన
- తీవ్రంగా గాయపడిన పూర్ణేకర్‌ను ఆర్ మాల్ సమీపంలోని ఇన్ఫినిటీ ఆసుపత్రికి తరలింపు
కాల్పులకు పాల్పడిన వారెవరో ఇంకా తెలియలేదని కథనాలు పేర్కొన్నాయి. ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.