ముంబై, అక్టోబర్ 2: మహారాష్ట్రలోని అమరావతి జిల్లా సమృద్ధి మహామార్గ్ (ఎక్స్‌ప్రెస్‌వే)పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం ఏడుగురు మరణించగా, మరో 18 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు అమరావతి–ధామణ్‌గావ్ రైల్వే సమీపంలోని చైనేజ్ నంబర్ 97 వద్ద షేగావ్ నుంచి వార్ధాకు దుర్గామాత విగ్రహాన్ని తీసుకెళ్తున్న బొలెరో పికప్ వ్యాన్, ఓ ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఢీకొన్న తీవ్రతకు పికప్ వ్యాన్‌లోని ఏడుగురు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. (యూఎన్ఐ)