ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నాగ్‌పూర్‌లో గురువారం నిర్వహించిన 'ఆశీర్వాద్ కా దియా' కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది లబ్ధిదారులు దీపాలు వెలిగించి ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.
మోదీ జన్మదినంతో పాటు, దేశాధినేతగా ఆయన 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మహారాష్ట్రతో సహా దేశవ్యాప్తంగా 'సేవా సంకల్ప అభియాన్' నిర్వహిస్తున్నట్టు ఫడణవీస్ మీడియాతో అన్నారు.
ఈ ప్రచారంలో భాగంగా 'ఏక్ దీప్ ఆశీర్వాద్ కా' పేరుతో లబ్ధిదారులు దీపం వెలిగించి ప్రధానికి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా భాజపా సేవా ఆధారిత కార్యక్రమాలు, ప్రజా సంబంధాల కార్యక్రమాలు నిర్వహించనుంది.
