ముంబై, అక్టోబర్ 2: పలువురు మంత్రులు గట్టిగా డిమాండ్ చేయడంతో కరవు ప్రభావిత తాలూకాల జాబితాలో మరో 19 తాలూకాలను చేర్చినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.
కొత్తగా చేర్చిన తాలూకాల్లో వ్యవసాయ పరిస్థితిపై సమగ్ర అంచనా వేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి తాలూకాలో రాష్ట్రంలోని ఐదు ప్రధాన పంటలపై 20 శాతం సర్వే నిర్వహించి, ప్రభావిత ప్రాంతాల్లో భౌతిక తనిఖీలు చేసి, నివేదికలను అత్యవసరంగా సమర్పించాలని సూచించింది. జాబితా నుంచి తమ ప్రాంతాలను మినహాయించడంపై కొందరు మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. (యూఎన్ఐ)