కర్నూలు, సెప్టెంబర్ 26: నగరంలోని గాంధీనగర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సూపర్‌స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ టీజీ భరత్ ఆవిష్కరించారు.
- గాంధీనగర్ సర్కిల్‌లో సూపర్‌స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి టీజీ భరత్
- 350కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడని కొనియాడిన మంత్రి
- సూపర్‌స్టార్ కృష్ణ ఎంతో క్రమశిక్షణ కలిగిన నటుడని వ్యాఖ్య
- కర్నూలులో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని మంత్రి వెల్లడి
- అభిమానులు తమ అభిమాన హీరోలపై ప్రేమను సేవా కార్యక్రమాల ద్వారా చాటుకోవాలని సూచన
ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ సూపర్‌స్టార్ కృష్ణ ఎంతో క్రమశిక్షణ కలిగిన నటుడని అన్నారు. 350కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు సూపర్‌స్టార్ కృష్ణ అని కొనియాడారు. కర్నూలు నగరంలో సూపర్‌స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మంత్రి తెలిపారు.
అభిమానులు తమ అభిమాన హీరోలపై ఉన్న ప్రేమను సేవా కార్యక్రమాల ద్వారా చాటుకోవాలని మంత్రి టీజీ భరత్ సూచించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను అభిమానులు నిరంతరం కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.
