కర్నూలు, సెప్టెంబర్ 29: కర్నూలు నగర ప్రజల రైలు ప్రయాణ సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా మరో ముందడుగు పడింది. కర్నూలు సిటీ–విజయవాడ మధ్య కొత్త రైలు సర్వీస్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ఈ మేరకు కేంద్ర రైల్వే, సమాచార ప్రసార, ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్.. మంత్రి టీజీ భరత్‌కు లేఖ రాశారు. మచిలీపట్నం–కర్నూలు సిటీ మధ్య విజయవాడ మీదుగా కొత్త రైలు ప్రవేశపెట్టేందుకు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి తన లేఖలో తెలిపారు.
