కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అమలు, పురోగతి, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంశంపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని, తమ శాఖల్లో కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల అమలు తీరు, పురోగతిపై కలెక్టర్కు వివరాలు అందించారు. ప్రజల్లో సానుకూల అభిప్రాయం (పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్) పెంపొందించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
