దుబాయ్, అక్టోబర్ 16 (ఎక్స్‌ప్రెస్ టుడే): యెమెన్‌లోని ఎడెన్ నగరంలో ఉన్న అల్-మాషిక్ అధ్యక్ష భవనాన్ని లక్ష్యంగా చేసుకుని హూతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో ఐదుగురు మరణించగా, 16 మంది గాయపడ్డారని యెమెన్ ఆరోగ్య మంత్రి వెల్లడించారు.
ప్యాలెస్‌కు పశ్చిమాన ఉన్న బురైఖా ప్రాంతంలో కూటమి వినియోగిస్తున్న ప్రాంగణం సమీపంలో క్షిపణులు పడ్డాయని ఒక అధికారి తెలిపారు. దాడి సమయంలో అక్కడ సీనియర్ అధికారులెవరూ లేరని ఆయన పేర్కొన్నారు.
యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి 2015 నుంచి పోరాడుతోంది. సుదీర్ఘ కాల్పుల విరమణ కుప్పకూలిన తర్వాత సెప్టెంబర్‌లో యెమెన్ అంతర్యుద్ధం మళ్లీ రాజుకుంది. ప్రభుత్వ అధీనంలోని ఎడెన్ విమానాశ్రయంపై కూడా దాడి చేసినట్లు హూతీలు ప్రకటించారు.