వాషింగ్టన్, నవంబర్ 4 (ఎక్స్‌ప్రెస్ టుడే): హార్ముజ్ జలసంధిలోని ఇరాన్ ఖేష్మ్ ద్వీపంపై అమెరికా సైన్యం సోమవారం రాత్రి దాడులు చేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ధ్రువీకరించారు.

ఇరాన్ దళాలు అమెరికా సైనిక స్థావరాలపై ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు ప్రయోగించడంతో, ఆత్మరక్షణ కోసం ఈ దాడులు జరిగాయని అమెరికా అధికారులు తెలిపారు. ఎన్నికల తర్వాత ఇరాన్‌పై దాడుల గురించి ఆలోచించడం లేదని, ఒప్పందం సాధ్యమేనని ట్రంప్ కొన్ని గంటల ముందు చెప్పడం గమనార్హం.

అమెరికా–ఇరాన్ ఒప్పందంపై తాము ఆశాభావంతో ఉన్నామని ఖతార్ తెలిపింది. అమెరికా దాడుల తర్వాత ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించినట్లు కథనాలు పేర్కొన్నాయి.