వాషింగ్టన్, నవంబర్ 4 (ఎక్స్‌ప్రెస్ టుడే): మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటములకు ఇరాన్‌తో యుద్ధం కూడా ఒక కారణమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. అయితే ఆ యుద్ధంపై తనకు విచారం లేదని, మళ్లీ అదే నిర్ణయం తీసుకునేవాడినని ఆయన స్పష్టం చేసినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
డెమోక్రాట్లు తన ముందుకు తెచ్చే చట్టాలను ‘అసంబద్ధం’గా భావిస్తే వీటో చేస్తానని ట్రంప్ ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇరాన్ యుద్ధమే రిపబ్లికన్ల నష్టానికి కారణమని, 2024లో ట్రంప్‌కు మద్దతిచ్చిన ఓటర్లు ఈ సంఘర్షణ కారణంగా పార్టీకి దూరమయ్యారని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ఫలితాలు అమెరికా ప్రజలు యుద్ధాన్ని తిరస్కరించినట్లు సూచిస్తున్నాయని ఇరాన్ చీఫ్ నెగోషియేటర్ బుధవారం పేర్కొన్నారు.