వాషింగ్టన్, సెప్టెంబర్ 30: ఇరాన్ ఆయుధ సేకరణ నెట్‌వర్క్‌లకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై పలు సంస్థలు, వ్యక్తులపై అమెరికా ప్రభుత్వం మంగళవారం కొత్త ఆంక్షలు ప్రకటించింది. టెహ్రాన్‌పై అమెరికా కొనసాగిస్తున్న ఆర్థిక ఒత్తిడి కార్యక్రమం 'ఆపరేషన్ ఎకనామిక్ ఔట్‌కాస్ట్'కు ఇవి మద్దతుగా నిలుస్తాయని విదేశాంగ శాఖ తెలిపింది. దీనిని అధ్యక్షుడు ట్రంప్ 'ఆర్థిక డి-డే'గా అభివర్ణించారు.
పునరుద్ధరించిన ఐక్యరాజ్యసమితి చర్యలను ఉల్లంఘిస్తూ ఇరాన్ గత ఏడాది కాలంగా ఆయుధాలు, సంబంధిత సామగ్రిని సేకరించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్ రక్షణ పరిశ్రమకు, ఆయుధ విస్తరణ కార్యకలాపాలకు తోడ్పడుతున్న మూడో దేశాల సంస్థలను కూడా ఆంక్షల పరిధిలోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు.
ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ), దాని శాఖల ఆర్థిక యంత్రాంగాన్ని దెబ్బతీయడానికి దోహదపడే సమాచారమిచ్చినవారికి 1.5 కోట్ల డాలర్ల వరకు బహుమతి ఇస్తామని కూడా విదేశాంగ శాఖ ప్రకటించింది.