అమెరికా, కెనడాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. కెనడా నుంచి వచ్చే ఆటోమొబైల్స్, కార్ల విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
కెనడా తమను దోపిడీ చేస్తోందని ఆరోపిస్తూ, జనవరి 1 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి తెస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీనిపై కెనడా ప్రభుత్వం తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది.
ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ, తాజా ప్రకటనతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
