దక్షిణాఫ్రికా, నవంబర్ 5 (ఎక్స్‌ప్రెస్ టుడే): దక్షిణాఫ్రికాలో బుధవారం దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 257 మున్సిపాలిటీల్లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరిగింది. నెల్సన్ మండేలా పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ) 2021లో తొలిసారి స్థానిక ఎన్నికల్లో 50 శాతం కంటే దిగువకు పడిపోగా, ఈసారి దాని మద్దతు 40 శాతం కన్నా తక్కువకు పడిపోవచ్చని సర్వేలు సూచిస్తున్నాయి.

డెమోక్రసీ నౌ నివేదిక ప్రకారం, 28 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిన సమయానికి ఏఎన్‌సీకి సుమారు 32 శాతం ఓట్లు వచ్చాయి. పూర్తి ఫలితాలు ఆదివారం వెలువడే అవకాశం ఉంది.

అస్తవ్యస్త నీటి, విద్యుత్ సరఫరా, నిరుద్యోగం, నేరాలు, అందుబాటు ధరల్లో ఇళ్ల కొరత తమ ప్రధాన ఆందోళనలని ఓటర్లు తెలిపారు.