కీవ్, సెప్టెంబర్ 29: ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన తాజా డ్రోన్, క్షిపణి దాడుల్లో తొమ్మిది మంది మరణించగా, 80 మంది గాయపడ్డారు. రాజధాని కీవ్‌లోని ఉక్రెయిన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ భవనం కూడా లక్ష్యంగా మారింది.

సోమవారం పనివేళల్లో రష్యా డ్రోన్ ఆ భవనాన్ని తాకడంతో ఇద్దరు మరణించారు. ఎలాంటి శబ్దం, హెచ్చరిక లేకుండానే దాడి జరిగిందని ప్రాణాలతో బయటపడినవారు తెలిపారని డెమోక్రసీ నౌ వార్తా సంక్షిప్తం పేర్కొంది.

రష్యా ప్రయోగించిన 120 డ్రోన్లలో 80 కొత్తరకం జెట్ ఇంజిన్ డ్రోన్లని, వాటిని కూల్చడం మరింత కష్టమని అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు.