లండన్, సెప్టెంబర్ 29: బ్రిటన్‌లో అమెరికా బాంబర్లు వినియోగించే ఆర్‌ఏఎఫ్ ఫెయిర్‌ఫోర్డ్ వైమానిక స్థావరం వద్ద పేలుడు పదార్థాలతో సంచరించారన్న అనుమానంతో ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టయిన ఐదుగురిని బెయిల్‌పై విడుదల చేశారు.

ఇరాన్‌పై పరిమిత బాంబింగ్ దాడులకు అమెరికా ఈ స్థావరాన్ని ఉపయోగించిందని, తమపై దాడులకు వాడే స్థావరాలు చట్టబద్ధ లక్ష్యాలేనని ఇరాన్ గతంలో బ్రిటన్‌ను హెచ్చరించిందని వరల్డ్ రేడియో తెలిపింది. ఈ కుట్రతో తమకు సంబంధం లేదని ఇరాన్ ఖండించింది.

ఈ కుట్ర వెనుక 'విదేశీ శక్తి' ఉన్నట్లు అనుమానిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. అనుమానితులను విడుదల చేయడం తనను ఆశ్చర్యపరిచిందని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు.