భారత్‌కు ఇంధనం, ఎరువులను నిరంతరాయంగా సరఫరా చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇరు దేశాలు చర్చలు జరిపాయి.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అంతరాయాల నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించింది. ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడి హామీ కీలకంగా మారింది.
ఇంధన సహకారంతో పాటు రక్షణ, వాణిజ్య రంగాల్లోనూ సహకారాన్ని విస్తరించాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు సమాచారం.
