న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఉక్రెయిన్ సంఘర్షణ పరిష్కారం కోసం భారత్ ఇటీవలి నెలల్లో కేవలం వాదన (అడ్వకసీ)కే పరిమితం కాకుండా కీవ్, మాస్కో రెండింటితోనూ చర్చలు జరుపుతూ కృషిని పెంచిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆదివారం తెలిపారు.
సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించడంలో న్యూఢిల్లీ పాత్రను బహిరంగంగా అంగీకరించడం ఇదే మొదటిసారని పీటీఐ కథనం పేర్కొంది.