వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు వీలుగా ఏడు షరతులను మధ్యవర్తుల ద్వారా అమెరికాకు అందజేసినట్టు ఇరాన్ అధికార వర్గాలు వెల్లడించాయి. దేశ అత్యున్నత అధికార యంత్రాంగం ఆమోదించిన ఈ షరతులు నెరవేరే వరకు జలసంధి మూసివేతే కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసింది.
- హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి అమెరికాకు ఏడు షరతులు అందజేసిన ఇరాన్
- ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధనం ఎత్తివేయాలని, ఆంక్షలు తొలగించాలని డిమాండ్
- యుద్ధానికి ముగింపు, సరిహద్దుల వెంట మోహరించిన అమెరికా బలగాల ఉపసంహరణ కూడా షరతుల్లో భాగం
- ఒమన్‌తో ఇరాన్ ఒప్పందం జలసంధి పూర్తి పునఃప్రారంభాన్ని సూచించదని స్పష్టీకరణ
నష్టపరిహారం చెల్లించాలని, తమ అణు-క్షిపణి సామర్థ్యాల జోలికి రావొద్దన్న హామీ ఇవ్వాలని కూడా ఇరాన్ షరతుల్లో పేర్కొన్నట్టు సమాచారం. మధ్యవర్తుల ద్వారా ఈ షరతులను అమెరికాకు చేరవేసినప్పటికీ, వాషింగ్టన్ నుంచి అధికారికంగా ఇంకా స్పందన రాలేదు.
ఒమన్‌తో జలసంధి నిర్వహణపై ఇరాన్ ఒక అవగాహనకు వచ్చినప్పటికీ, అది జలసంధి పూర్తిస్థాయిలో తిరిగి తెరవడాన్ని సూచించదని, తమ షరతులు నెరవేరితేనే అంతిమ నిర్ణయం ఉంటుందని ఇరాన్ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో ప్రపంచ చమురు సరఫరాపై అనిశ్చితి కొనసాగుతోంది.
