అమెరికా ఆంక్షలతో ఇంధన రంగం ఒత్తిడిలో ఉన్న వేళ ఇరాన్‌కు భారీ ఊరట లభించింది. దక్షిణ ఫార్స్‌ ప్రావిన్స్‌లో 7.5 ట్రిలియన్‌ ఘనపుటడుగుల సహజవాయు నిల్వలను గుర్తించినట్లు ఇరాన్‌ చమురు మంత్రి మొహ్సెన్‌ పక్నెజాద్‌ ప్రకటించారు.

ఇరాన్‌ను ఆర్థికంగా మరింత ఒంటరి చేయాలన్న లక్ష్యంతో అమెరికా కొత్త ఆంక్షలు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ గ్యాస్‌ నిల్వల గుర్తింపు వెలుగులోకి రావడం గమనార్హం. టెహ్రాన్‌కు సాయం చేసే దేశాలపైనా అమెరికా కఠిన ఆంక్షలు విధించనుంది.

ఇరాన్‌ కరెన్సీ రియాల్‌ విలువ ఇటీవల రికార్డు కనిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో, ఈ కొత్త ఇంధన నిల్వలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊతమిచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.