రియాద్, సెప్టెంబర్ 20: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై క్షిపణి, డ్రోన్ దాడులు జరిపినట్టు యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రాంతంలో నివసిస్తున్న, పర్యటిస్తున్న తమ పౌరులకు అమెరికా విదేశాంగ శాఖ ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అమెరికన్లకు సూచించింది.
యెమెన్ అంతర్యుద్ధంలో సౌదీ నేతృత్వంలోని కూటమికి, హౌతీ తిరుగుబాటుదారులకు మధ్య కొనసాగుతున్న ఘర్షణలో భాగంగా ఇలాంటి దాడులు గతంలోనూ చోటుచేసుకున్నాయి. తాజా దాడులపై సౌదీ అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
