టెహ్రాన్, సెప్టెంబర్ 30: హార్ముజ్ జలసంధిలో మంగళవారం ఒక చమురు ట్యాంకర్ను గుర్తుతెలియని ప్రక్షేపకం తాకిందని బ్రిటన్కు చెందిన సముద్ర వాణిజ్య కార్యకలాపాల కేంద్రం (యూకేఎంటీవో) బుధవారం వెల్లడించింది. ఈ ఘటనపై తమకు నివేదిక అందిందని మాత్రమే అది తెలిపినట్లు ఏబీసీ న్యూస్ పేర్కొంది.
మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యూఏఈ పర్యటనను ఇరాన్ విదేశాంగ శాఖ మంగళవారం ఖండించింది. ప్రాంతంలో ఇజ్రాయెల్ ఉనికి 'చాలా ప్రమాదకరమైన పరిణామాలకు' దారితీస్తుందని హెచ్చరించింది. ఇది ప్రాంత సమష్టి శాంతి, భద్రతలకు ముప్పని, అన్ని దేశాలూ దీని పర్యవసానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
ప్రాంతీయ శాంతి, స్థిరత్వం విషయంలో తమ బాధ్యతను ప్రాంత ప్రభుత్వాలు గుర్తించాలని ఆశిస్తున్నామని కూడా ఇరాన్ విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొన్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.