హెచ్‌-1బీ వీసా ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌ ఇచ్చింది. ఈ వీసా దరఖాస్తులపై కొత్తగా 1,03,265 డాలర్ల రుసుమును ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకుంది.

అమెరికాలో చదువు, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ విద్యార్థులు, నిపుణులపై ఈ నిర్ణయం ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. హెచ్‌-1బీతో పాటు ఎఫ్‌-1 ఓపీటీ ప్రోగ్రామ్‌కూ కొత్త ఫీజులు వర్తించనున్నాయి.

నిర్ణీత కాలవ్యవధి వీసాలకు సంబంధించి సెప్టెంబరు 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో, విదేశీ విద్యార్థులను అమెరికా విశ్వవిద్యాలయాలు అప్రమత్తం చేశాయి.