అబుదాబి, అక్టోబర్ 28 (ఎక్స్‌ప్రెస్ టుడే): సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన కాక్‌పిట్ దాడి సమయంలో ధైర్యసాహసాలు చూపిన భారత కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు, ఎఫ్‌జెడ్1073 విమాన సిబ్బందికి యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ పురస్కారం ప్రదానం చేశారు. దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ ఈ పురస్కారాన్ని అందజేశారు.