గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసీ)లో వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

కొత్తగా ఏర్పాటు చేసిన 120 వార్డుల సరిహద్దులను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.

నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో కొత్త వార్డుల సరిహద్దులను నిర్ధారిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.