గార్గేయపురం డంప్‌యార్డులో చెత్త బయో మైనింగ్ ప్రక్రియ, వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌లను రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పరిశీలించారు.

ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో కలిసి పట్టాభిరామ్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పురపాలక, పారిశుధ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.