ఆంధ్రా యూనివర్సిటీ వారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆహ్వానం మేరకు హాజరైనట్టు నిర్వాహకులు తెలిపారు.

గాజువాకలో సెప్టెంబర్ 5న జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేముడు గారు మాట్లాడుతూ, “గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురు దేవో మహేశ్వరా, గురు సాక్షాత్తు పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః” అంటూ, మహా జీవితాన్ని పంచిన తొలిగురువులైన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, సమాజంలో వివిధ రంగాల్లో మార్గదర్శిగా నిలుస్తున్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

ఈ కార్యక్రమంలో 73వ వార్డు ప్రధాన కార్యదర్శి నంబారు దేముడు, వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి గుంటపల్లి ప్రసాద్, గాజువాక నియోజకవర్గం బీసీ సెల్ ఉపాధ్యక్షులు దొడ్డి వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జగన్నాధరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిట్ అండ్ అకడమిక్ ఎక్సలెన్స్ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తూ, ఉపాధ్యాయ వృత్తి పట్ల గౌరవాన్ని చాటుకున్నారు.