న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మారుతున్న భద్రతా పరిస్థితులతో పాటు ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని విస్తరించే మార్గాలపై భారత్, అమెరికా చర్చించాయి.
- అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ బ్రియాన్ మాస్ట్ నేతృత్వంలోని ఇరు పార్టీల ప్రతినిధి బృందంతో రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ సమావేశమయ్యారు
- భారత్–అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ
- రక్షణ పారిశ్రామిక, సాంకేతిక సహకారానికి ప్రత్యేక ప్రాధాన్యం
ఈ భేటీ వివరాలను రక్షణ మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో వెల్లడించింది. ఇరు దేశాల సైనిక సంబంధాలను బలోపేతం చేసే 'యుద్ధ్ అభ్యాస్' వంటి సంయుక్త విన్యాసాలు, వ్యూహాత్మక పారిశ్రామిక భాగస్వామ్యాలు చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి.
ఇటీవల జరిగిన 'యుద్ధ్ అభ్యాస్ 2026' విన్యాసం ఇరు ప్రజాస్వామ్య దేశాల రక్షణ బంధం బలానికి నిదర్శనమని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు.