రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక సేవలను బలోపేతం చేసేందుకు రూ.40 కోట్ల వ్యయంతో సమకూర్చిన 58 అధునాతన ఫైర్‌ ఫైటింగ్‌ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

కొత్తగా అందిన వాహనాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్కై లిఫ్ట్‌లు, వాటర్‌ మిస్ట్‌ యూనిట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.

పట్టణ ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామాల్లోనూ వేగంగా సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు.

రాబోయే రోజుల్లో మరిన్ని అగ్నిమాపక కేంద్రాలను ఆధునీకరించే ప్రణాళిక ఉందని ప్రభుత్వం ప్రకటించింది.