రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ప్రతిపాదనలను త్వరితగతిన సిద్ధం చేసి పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ కలెక్టర్లను ఆదేశించారు.

మంగళవారం విజయవాడ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన హామీల అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ముఖ్యమంత్రి హామీల అమలుకు సంబంధించి ఆయా శాఖలకు ప్రతిపాదనలను సంబంధిత హెచ్‌ఓడీలకు పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆర్థిక వ్యయం అవసరమయ్యే పనులకు మాత్రమే ప్రతిపాదనలు పంపించాలన్నారు. ముఖ్యమంత్రి హామీల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా, ప్రతిపాదనల నుంచి పనుల గ్రౌండింగ్ వరకు ప్రతి దశను సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలయ్యే విధంగా ఆయా శాఖల అధికారులు త్వరితగతిన ప్రతిపాదనలు రూపొందించి హెచ్‌ఓడీలకు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమావేశంలో సీపీఓ భారతి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, డ్వామా పీడీ నరసింహ రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి ప్రసూన, తదితరులు పాల్గొన్నారు.