ప్రతి ఇంటా భక్తిశ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విఘ్నాలను తొలగించి విజయాలను అందించేలా వినాయక చవితిని ఊళ్లు, కాలనీలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా వాడవాడలా అన్ని వర్గాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారని ఆయన అన్నారు.
- ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు
- అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చే గొప్ప సామాజిక పండుగ వినాయక చవితి అని వ్యాఖ్య
- మట్టి వినాయక ప్రతిమలను పూజిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపు
- రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు గణనాథుడి ఆశీస్సులు కోరిన సీఎం
అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చే గొప్ప సామాజిక పండుగ వినాయక చవితి అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
మట్టి వినాయక ప్రతిమలను పూజిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను మరింత వైభవంగా కొనసాగించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఆశీర్వదించాలని గణనాథుడిని వేడుకుంటున్నట్లు సీఎం పేర్కొన్నారు.
ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని సీఎం చంద్రబాబు నాయుడు తన సందేశాన్ని ముగించారు.
