అమరావతి, సెప్టెంబర్ 26: విశాఖ తరహాలోనే విజయవాడలోనూ భారీ ఎత్తున 24,057 మంది లబ్దిదారులకు ఇళ్ల క్రమబద్దీకరణ పట్టాలను అందించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇటీవలే విశాఖలో పండుగ వాతావరణంలో రూ.8,874 కోట్ల విలువైన భూమిపై 28,445 కుటుంబాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ క్రమబద్దీకరణ పట్టాలు అందించిన సీఎం, ఇప్పుడు విజయవాడలో రూ.9,800 కోట్ల విలువైన భూమిపై 24,057 కుటుంబాలకు క్రమబద్దీకరణ పట్టాలు అందించనుంది కూటమి ప్రభుత్వం.
- ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం నియోజకవర్గంతో కలిపి మొత్తం 8 నియోజకవర్గాల్లోని 15 మండలాల్లో పట్టాల పంపిణీ
- విజయవాడ తూర్పు, పశ్చిమం, సెంట్రల్, గన్నవరం, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లోని లబ్దిదారులకు అందజేత
- 617 ఎకరాల్లోని 29.86 లక్షల చదరపు గజాల స్థలంపై లబ్దిదారులకు సంపూర్ణ హక్కుల కల్పన
- ఈ భూముల మార్కెట్ విలువ సుమారు రూ.24,297 కోట్లుగా అంచనా; ఒక్కో కుటుంబానికి రూ.40-45 లక్షల వరకు లబ్ది
- సామాజికవర్గాల వారీగా లబ్ది: బీసీలు 12,093, ఓసీలు 6,130, ఎస్సీలు 4,546, ముస్లిం బీసీలు 955, ఎస్టీలు 333 కుటుంబాలు
క్రమబద్దీకరణ పట్టాలివ్వాలన్న లబ్దిదారుల దశాబ్దాల కలను నిజం చేస్తూ, పేద మధ్య తరగతి కుటుంబాలకు సంపూర్ణ హక్కు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఈ పట్టాలను పంపిణీ చేయనుంది. ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం నియోజకవర్గం కలిపి మొత్తం 8 నియోజకవర్గాల్లోని 15 మండలాల్లో సంపూర్ణ హక్కులతో క్రమబద్దీకరణ పట్టాలను ముఖ్యమంత్రి అందించనున్నారు. విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమం, విజయవాడ సెంట్రల్, గన్నవరం, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లోని లబ్దిదారులకు ఈ పట్టాల అందజేత జరగనుంది.
నియోజకవర్గాల వారీగా లబ్దిదారుల సంఖ్య చూస్తే — విజయవాడ తూర్పులో 7,990 మంది, విజయవాడ పశ్చిమంలో 7,465 మంది, విజయవాడ సెంట్రల్లో 5,815 మంది, గన్నవరంలో 602 మంది, జగ్గయ్యపేటలో 1,135 మంది, మైలవరంలో 981 మంది, నందిగామలో 54 మంది, తిరువూరులో 15 మంది లబ్దిదారులు ఉన్నారు.
617 ఎకరాల్లోని 29.86 లక్షల చదరపు గజాల స్థలంపై లబ్దిదారులకు సంపూర్ణ హక్కులు కల్పించనున్న కూటమి ప్రభుత్వం, ఈ భూముల మార్కెట్ విలువ సుమారు రూ.24,297 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. ఒక్కో కుటుంబానికి రమారమి రూ.40-45 లక్షల వరకు లబ్ది చేకూర్చేలా ఈ క్రమబద్దీకరణ పట్టాలు అందించనున్నారు. సంపూర్ణ హక్కులు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం పంపిణీ చేయబోతున్న పట్టాల ద్వారా బీసీలు 12,093 మంది, ఓసీలు 6,130 మంది, ఎస్సీలు 4,546 మంది, ముస్లిం బీసీలు 955 మంది, ఎస్టీలు 333 మంది కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.
