అమరావతి, సెప్టెంబరు 16: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం (17-09-26) ఉదయం 7.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 9.35 గంటలకు వారణాసి చేరుకుంటారు. ముందుగా 11.15 గంటలకు వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథుడ్ని ముఖ్యమంత్రి దర్శించుకోనున్నారు.

అనంతరం రుద్రాక్ష్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ చేరుకుని సేవా యాత్ర ఫ్లాగ్‌ ఆఫ్ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం 3.10 గంటలకు వారణాసి నుంచి బయలుదేరి 5.15 గంటలకు తిరిగి అమరావతి చేరుకోనున్నారు.