వారణాసి, సెప్టెంబరు 17: 'వారణాసి-వాద్‌నగర్ సేవాయాత్ర'లో పాల్గొనేందుకు వారణాసి వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు యూపీ ప్రభుత్వ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.

అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సీఎం చంద్రబాబు నాయుడు స్నేహపూర్వక వాతావరణంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, అభివృద్ధి అంశాలపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.