కుప్పం, సెప్టెంబర్ 21: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల నియామకాలపై సాగుతున్న దుష్ప్రచారంపై కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.
- డీఎస్సీ ఉద్యోగాలు తమ కష్టార్జితమని టీచర్లంతా నినదిస్తున్నారు
- ఫేక్ పార్టీ అందరినీ ఫేక్ అంటే సహించేది లేదని విజయవాడలో స్పోర్ట్స్ టీచర్లు ఆందోళన చేస్తున్నారు
- ఇవాళ విజయవాడలో రౌడీలు గురువులపై దాడి చేస్తున్నారు
- టీచర్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. చర్యలు తీసుకుంటాం
- సీబీఎన్ జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లలో అవినీతే జరగదు. నా హయాంలో ఎప్పుడూ పేపర్ లీక్ కాలేదు
- సీబీఎన్ పాలనలో టీచర్ల రిక్రూట్‌మెంట్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం... ఇదీ మన ట్రాక్ రికార్డ్
- నియామకాలు జరిగిన ఏడాది తర్వాత ఇప్పుడు లేనిపోని దుష్ప్రచారం చేస్తూ బురద జల్లుతున్నారు
- కర్నూలు కొండారెడ్డి బురుజు, విజయవాడలో అంబేద్కర్ విగ్రహం, విశాఖలో సముద్రం ఒడ్డున దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ టీచర్లు గర్జించారు
- ఫేక్ పేపర్‌కు చెందిన రిపోర్టర్ ఓ ఉపాధ్యాయుడిపై దాడి చేశారంటే... వైసీపీ మూకలు ఎంతకు బరితెగించాయో అర్థం చేసుకోండి
- ఇలాంటి వాళ్లను ఇంకా ఉపేక్షించాలా..? వీరిలాగే కొనసాగితే ఆస్తులకు ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందా..?
- అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే సాక్ష్యాధారాలతో చూపించి వారి నోళ్లూ మూయిస్తాం
- చట్టబద్ధంగా జరిగిన ప్రక్రియపై అవసరమైతే కోర్టులకు వెళ్లొచ్చు... కానీ దాడులేంటీ...? ఉపాధ్యాయులపై రౌడీలను ఎగదోయడమేంటీ..?
- 2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. రాష్ట్రానికి అది మామూలు నష్టం కాదు
- నాటి పాలనలో పాలకులే రౌడీయిజం చేశారు, దారుణాలకు పాల్పడ్డారు
- కుప్పం వస్తే నన్ను కూడా ఇబ్బందులు పెట్టారు.. దౌర్జన్యాలకు దిగారు
- ఓడిపోయిన తర్వాత కూడా చంపడానికైనా చావడానికైనా సిద్ధం అంటూ రౌడీయిజం చేస్తున్నారు
- రౌడీయిజం చేసే వారి తోక కత్తిరిస్తాం. రౌడీలను విధ్వంసకారులను తరిమి కొట్టే సత్తా కుప్పానికి ఉంది
- ఫ్లెక్సీలకు పొట్టేళ్లు బలి ఇచ్చి రక్తాభిషేకం చేస్తున్న వారిని సైకోలు అనాలా..? మానసిక రోగులు అనాలా..?
- తిరుమల పవిత్ర లడ్డూను కూడా కల్తీ చేశారు
- ప్రతీ ఎన్నికలోనూ సైకిల్ గుర్తుకు మాత్రమే ఓటేసి మద్దతిచ్చిన నియోజకవర్గాలు ఒకటి కుప్పం, రెండోది హిందూపూర్
