అమరావతి: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి అమరావతి వచ్చిన కేంద్ర మంత్రి నడ్డాను శనివారం ఉదయం సీఎం చంద్రబాబు తమ నివాసానికి ఆహ్వానించారు.
- అమరావతి పర్యటనలో భాగంగా సీఎం నివాసానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాక
- జేపీ నడ్డాకు ఘనస్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- జ్ఞాపిక మార్పిడితో పరస్పర శుభాకాంక్షలు తెలిపిన ఇద్దరు నేతలు
- అనంతరం కాసేపు సమావేశమైన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నడ్డా
వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమరావతి వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ నివాసానికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డాకు సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. ఇరువురు నేతలు జ్ఞాపికలు అందజేసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
అనంతరం సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కాసేపు సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న ఆరోగ్య రంగ అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సందర్భంగా ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
