పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన 8 మంది ఈ నెల 27న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, చిలకలూరిపేట వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వేలూరు గ్రామానికి చెందిన 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

బాధిత కుటుంబాలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని పేర్కొన్న సీఎం చంద్రబాబు, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.