అమరావతి: సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీసీఆర్డీఏ 65వ అథారిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్‌తో పాటు, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ విజయ్ రామరాజు హాజరయ్యారు. అలాగే, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణం పనుల పురోగతి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.