వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు, ప్రయాణికుల డిమాండ్ మేరకు భువనేశ్వర్ – యశ్వంత్‌పూర్ – భువనేశ్వర్ మధ్య నడుస్తున్న వారాంతపు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను పొడిగిస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.

రైలు నం. 02811 భువనేశ్వర్ – యశ్వంత్‌పూర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్: ఈ రైలు 05.09.2026 నుంచి 28.11.2026 వరకు ప్రతి శనివారం భువనేశ్వర్ నుంచి రాత్రి 19:15 గంటలకు బయలుదేరుతుంది. మొత్తం 13 ట్రిప్పులు నడుస్తాయి. మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున 01:53 గంటలకు దువ్వాడ చేరుకుని 01:55 గంటలకు బయలుదేరుతుంది. సోమవారం అర్ధరాత్రి 00:15 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది.

రైలు నం. 02812 యశ్వంత్‌పూర్ – భువనేశ్వర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్: ఈ రైలు 07.09.2026 నుంచి 30.11.2026 వరకు ప్రతి సోమవారం యశ్వంత్‌పూర్ నుంచి ఉదయం 04:30 గంటలకు బయలుదేరుతుంది. మొత్తం 13 ట్రిప్పులు నడుస్తాయి. అదే రోజు రాత్రి 22:53 గంటలకు దువ్వాడ చేరుకుని 22:55 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు మంగళవారం ఉదయం 06:00 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.

నిలుపుదల స్టేషన్లు: ఖుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల, డోన్, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, హిందూపూర్, యలహంక.

కోచ్‌ల కూర్పు: 16 థర్డ్ ఏసీ కోచ్‌లు, 2 జనరేటర్ మోటార్ కార్లు.

ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.