గేట్‌వే ఆఫ్ ది ఈస్ట్‌గా పేర్కొంటున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి వాణిజ్య విమాన కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
తొలి ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్లో ప్రయాణించిన ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు లాంఛనంగా బోర్డింగ్ పాస్‌లు అందజేసి, జ్ఞాపికలతో సత్కరించారు.
హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకు భోగాపురం నుంచి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కలుగనుంది.
విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఉత్తరాంధ్ర చరిత్రలో ఒక కీలక ముందడుగుగా అభివర్ణిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అంతర్జాతీయ మార్గాలను దశలవారీగా అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.
