బెంగళూరు, సెప్టెంబర్ 20: నగరంలో 41 కిలోమీటర్ల మేర విస్తరించనున్న మెట్రో పింక్ లైన్ నిర్మాణ పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి, బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి డీకే శివకుమార్ ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని, భూసేకరణలో ఎదురవుతున్న అడ్డంకులను వేగంగా పరిష్కరించాలని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (బీఎంఆర్సీఎల్) అధికారులను ఆయన ఆదేశించారు.
నగర ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఈ మార్గం కీలక పాత్ర పోషిస్తుందని, వచ్చే ఏడాదిలోగా కొన్ని దశలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన తెలిపారు.
