పశ్చిమ గోదావరి, అక్టోబర్ 30 (ఎక్స్ప్రెస్ టుడే): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లారు. మొదట ఏరియల్ సర్వే ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
అనంతరం నర్సాపురం మండలం కొత్తనవరసపురంలో నీట మునిగిన వరి పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు.
మొగల్తూరు మండలం మాట్రేవు గ్రామంలో పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితులతో మాట్లాడి రేషన్ పంపిణీ చేశారు.
