విజయనగరం, అక్టోబర్ 15 (ఎక్స్‌ప్రెస్ టుడే): విజయనగరం జిల్లా అటవీ అధికారిగా శ్రీమతి బబితా కుమారి ఐ.ఎఫ్.ఎస్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా అటవీ అధికారి శ్రీ సామ సుందరం నుంచి ఆమె బాధ్యతలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా విజయనగరం రేంజ్ అధికారి శ్రీ రామ్ నరేష్ బిర్లంగి మొక్కతో ఆమెకు స్వాగతం పలికారు. పలువురు రేంజ్ అధికారులు, సిబ్బంది, జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

నూతన జిల్లా అటవీ అధికారి మాట్లాడుతూ, విజయనగరం జిల్లాలోని అటవీ సంపదను కాపాడటమే తన ముఖ్య లక్ష్యమని తెలిపారు. దీనితో పాటు నగరవనాలు, ఎకో టూరిజం పార్కుల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.